ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట

ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట

 ముస్లింలకు  రంజాన్ తొఫా  పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గత పాలకులు ముస్లిం పేదలను పట్టించుకోలేదు. ముస్లింలకు అండగా నిలిచి నాయకుడు కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అన్నారు. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో ధరూర్ మండల కేంద్రములో మసీదు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా రంజాన్ తోఫా కిట్ల ను నిరుపేద మైనార్టీలకు పంపిణీ చేశారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ....

ఎన్నో ఏళ్ల నుంచి ముస్లింలు పేదలుగానేమిగిలిపోయారన్నారు. కేవలం గత పాలకులు ఓట్ల వేసే యంత్రాలుగాని ఉపయోగించుకున్నారు. తప్ప ముస్లింలను అభివృద్ధి చేద్దామన్న సోయిలేకుండా పాలించారన్నారు.   గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందన్నారు. సమాజం విద్య ద్వారానే బాగుపడుతుందన్న సంకల్పంతో ముస్లిం మైనారిటీల పేదల పిల్లలను గురుకుల పాఠశాలల ద్వారా విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఏడాదికి ఒక్క విద్యార్థిపై లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. నేడు ఎందరో విద్యార్థులు గురుకుల పాఠశాలలో, కళాశాల లో చదువుకొని ఉద్యోగాలు సాధించారని, మరికొందరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని  ఎమ్మెల్యే అన్నారు. 
బిఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్ల కాలంలో 12000  కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసింది. ముస్లింల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీఆర్ఎస్  ప్రభుత్వానికి ముస్లింలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలను  అందించారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు, కులాలకు సీఎం కెసిఆర్, కేటీఆర్, సమాన ప్రోత్సహం అందరికి ఎల్లప్పుడు ఉంటుందని  పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఉండాలని  అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడుని కోరుకున్నట్లు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులు  నేతలకు మత పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ ఎంపీపీలు నజూమన్నీసా బేగం ప్రతాప్ గౌడ్, జడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి వైస్ ఎంపీపి సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ నాగిరెడ్డి సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ శివలీల, ఆలయం కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి,  మండలం పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, మండల మహిళా అధ్యక్షురాలు సుజాత, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్సింహులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు జాకీర్, శ్రీరాములు, రామకృష్ణ నాయుడు, గట్టు మండల పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్, ధరూర్ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ఉపాధ్యక్షుడు జాంపల్లి భరతసింహా రెడ్డి, మైనార్టీ సోదరులు, మత పెద్దలు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.