అత్తాపూర్ ఎస్ ఆర్ డిజి పాఠశాలకు విద్యాశాఖ నోటీసులు

అత్తాపూర్ ఎస్ ఆర్ డిజి పాఠశాలకు విద్యాశాఖ నోటీసులు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : అత్తాపూర్ ఎస్ ఆర్ డిజి పాఠశాలకు విద్యాశాఖ నోటీసులు జారి చేసారు. ఇటీవల స్కూల్ లో విద్యార్ధిని టీచర్ వేధించిన ఘటన నేపద్యంలో తల్లిదండ్రులు, బంధువులు దాడి చేసిన సంగటన నేపద్యంలో విద్యా శాఖ విచారణ మొదలెట్టారు.పాఠశాల నూ విద్యా శాఖ అధికారులు తనకి చేశారు.

పాఠశాల  లో  సీసీ కెమెరాల నిఘా లేదంటూ, చైల్డ్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు లేవంటూ రాజేంద్ర నగర్ మండల విద్యాశాఖ అధికారి రాంరెడ్డి నోటీసులు జారి చేసారు. పాఠశాలలో ఇతర సౌకర్యాలు కూడా సక్రమం గా లేవని విద్యాశాఖ అధికారులు నోటీసులో తెలిపారు. స్కూల్ లో విద్యార్ధిని టీచర్ వేధించిన ఘటన కు సంబందించి పాఠశాలలో సీసీ కెమెరా వ్యవస్థ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.