పరీక్ష సరిగ రాయలేదని 10వ తరగతి విద్యార్థి బలవన్మరణం

పరీక్ష సరిగ రాయలేదని 10వ తరగతి విద్యార్థి బలవన్మరణం
  • తెలుగు పరీక్ష తర్వాత ఇంటి నుండి వెళ్లిపోయిన విద్యార్థి
  •  మూడు రోజుల తర్వాత చెరువులో శవమై  తేలాడు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  పరీక్ష బాగా రాయలేదని మనస్థాపం చెందిన ఓ 10వ తరగతి విద్యార్థి బల్వన్మరణానికి మరణానికి పాల్పడ్డ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం మల్ రెడ్డి పల్లి లో  చోటుచేసుకుంది. తెలుగు పరీక్ష తర్వాత  పరీక్ష బాగా రాయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి రమేష్ అలియాస్ లడ్డు ఇంట్లో హాల్ టికెట్ వదిలి రెండు రోజులు కనిపించకుండా పోయాడు.దీంతో కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేడు మూడవ రోజు అయిన బుధవారం గ్రామం పక్కనే ఉన్న రెడ్డి చెరువులో శవమై తేలాడు. తీవ్ర కలకలం రేపింది ఈ సంఘటన. కుటుంబ సభ్యులు, యాలాల పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం. పెద్దెముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన కిష్టప్ప మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.

చిన్నవాడైనా రమేష్ యాలాల మండలం మల్రెడ్డిపల్లి లో ఉంటున్న పెద్దమ్మ వద్ద ఉండి జిల్లా పరిషత్ అగ్గనూరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా పరీక్ష మొదటి రోజు 3 తేదీన గౌతమి పాఠశాలలో పరీక్షకు హాజరయ్యారు. అదే రోజు 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం  బయటికి రావడంతో సదరు పాఠశాలలో మాస్ కాపీయింగ్ జరగకుండా స్ట్రిక్ట్ చేయడంతో పరీక్ష బాగా రాయలేదని మనస్థాపం చెందాడు. ఇంటికి చేరిన రమేష్ ఈ విషయాన్ని తోటి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో  పేర్కొన్నట్లు తెలిసింది. ఇంట్లోనే హాల్ టికెట్  ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఫిర్యాదు అందుకున్న యాలాల ఎస్సై అరవింద్ స్థానికుల సమాచారం మేరకు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు.  శవ పంచనామ రమేష్ మృతదేయాన్ని తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.దీంతో రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది