భార్యను హత్య చేసి ఆర్ఎంపి డాక్టర్ ఆత్మహత్య

భార్యను హత్య చేసి ఆర్ఎంపి డాక్టర్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ లిమెట్స్  జనవాడ గ్రామంలో   విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో ఆర్ ఎం పీ డాక్టర్ నాగరాజు ,తన భార్య సుధాను హత్య చేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

ఆర్ ఎంపి డాక్టర్ దంపతులకు ఇద్దరు కొడుకులు కాగ ఘటనకు ముందు భార్యభర్తలు గొడవ పడ్డారని, పెద్దకొడుకు తొమిదేళ్ల  దీక్షిత్ ను సైతం హత్య చేసేందుకు ప్రయత్నించగా తాన తమ్ముడిని తీసుకొని బయటకు వచ్చి తప్పించుకున్నానని దీక్షిత్ వివరించాడు.

ఘటనకు సంబంధించిన సమాచారం అందిన నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబకలహాలే అఘాయిత్యానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.