నకిలీ బంగారాన్ని చూపించి లక్ష రూపాయలతో పరారు 

నకిలీ బంగారాన్ని చూపించి లక్ష రూపాయలతో పరారు 

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  నకిలీ బంగారాన్ని చూపించి లక్ష రూపాయలతో వ్యక్తి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బడంగ్ పేటలోని జయశంకర్ నగర్ లో నివసించే శీనుకు గణేష్ అనే వ్యక్తి తన వద్ద స్వచ్ఛమైన బంగారం ఉందని ఆశ  చూపించాడు. తన వద్దనున్న బంగారం కడ్డీల నుంచి కొంత కట్ చేసి పరీక్షించుకోవాలని చెప్పాడు. దాన్ని బంగారం దుకాణం వద్ద పరిశీలించగా నిజమైన బంగారమే అని నిర్ధారణ అయింది. అయితే తనకు డబ్బు అత్యవసరం ఉందని, లక్ష రూపాయలు ఇవ్వాలని శ్రీనును అడిగాడు అందుకు కావాలంటే నీ దగ్గర బంగారాన్ని పెడతానంటూ తెలిపారు దేనితో తక్కువకు బంగారం వస్తుందన్న ఆశతో లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆ బంగారు కడ్డీని తీసుకెళ్లి పరీక్షించగా అది నాకు లేదని తేలింది దీంతో బాధితుడు బోరన విలపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. గణేష్ అనే వ్యక్తిపై బాధితుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు