నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారు

నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారు
  •  చీడపురుగులు పార్టీని వీడితే నష్టం కన్నా లాభమే ఎక్కువ
  •  పార్టీని కాదు నిజాయితీ ఉంటే పదవులను వీడండి
  •  విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ నేతలు

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: టిఆర్ఎస్ పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతలను నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారని టిఆర్ఎస్ నేతలు  అన్నారు. శుక్రవారం వనపర్తి తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, ఖిలా గణపురం ఎంపీపీ కృష్ణా నాయక్ తదితరులు  మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి  పదవులను కట్టబెడితే మంత్రిపైనే ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. పార్టీని వీడితే నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. పదవులను వీడాలని వారు డిమాండ్ చేశారు. కాలువ తవ్విన కాంట్రాక్టర్ తానే వనపర్తికి నీళ్లు తెచ్చానని అంటున్నాడని, పెళ్లికి భజంత్రీ వాయించడానికి వచ్చిన వ్యక్తి పెళ్లి నేనే చేశాను అని అన్నట్లుందని వారన్నారు. అసంతృప్తి నేతలు చీకటి రాజకీయాలు మానుకోవాలని వారు హెచ్చరించారు. బయటికి రప్పిస్తామని, ప్రజల ముందుకు లాగుతామని అసంతృప్తి నేతలను ఉద్దేశించి టిఆర్ఎస్ నేతలు అన్నారు.

వనపర్తి ప్రజలు అన్ని గమనిస్తున్నారని,  తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి జెండా కింద పనిచేసిన వ్యక్తి మంత్రి నిరంజన్ రెడ్డి అని, కౌన్సిలర్ స్థాయి వ్యక్తిని తీసుకువచ్చి జడ్పీ చైర్మన్ చేశారని, సర్పంచ్ స్థాయి వ్యక్తులను ఎంపీపీలను చేశారని, మంత్రి నిరంజన్ రెడ్డి మా దేవుడని, ప్రాణం పోయినా అతన్ని వదిలిపెట్టమని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన నేతలు ఈరోజు నీతులు వల్లించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. మీకు దమ్ముంటే ఏ పార్టీలో చేరుతారో ఎవరికి సపోర్ట్ చేస్తారో వెల్లడించాలని వారన్నారు. పనిచేస్తున్నారు అన్నది ప్రజలకు అర్థం అవుతుందన్నారు. మీ స్వార్థం కోసం ఎవరి సూచనల మేరకు నడుచుకుంటున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి నీ ఓడ కొడితేనే రాజకీయ భవిష్యత్తు అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారని వారన్నారు.

జడ్పీ చైర్మన్ ఎన్నోసార్లు వివిధ సమావేశాల్లో మూర్ఖంగా వ్యవహరించి తర్వాత మంత్రికి అనేకసార్లు క్షమాపణ చెప్పారని వారన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం టిఆర్ఎస్ను బదనాం చేస్తున్నారని వారు ఆరోపించారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యేలు వెనక ఉండి అసంతృప్తి నేతలను ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. రాజీనామా చేసిన వారు తాము రాజీనామా చేశామని పత్రికల ద్వారా తెలిపారని అవి అందకుంటే తామే సస్పెండ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ లోని వివిధ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.