బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

ముద్ర, వీపనగండ్ల(జులై 14): నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై చిన్నంబావి మండలం లోని పెద్ద దగడ గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు,పెద్దదగడ గ్రామ ఉపసర్పంచ్ చిన్న కొండయ్య,గ్రామ వార్డుసభ్యులు బాలకృష్ణ , మైబూస్ , నాయకులు నాగరాజు, ముని, మంగలి రాజు తోపాటు మరికొందరికి శుక్రవారం కొల్లాపూర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని  అన్నారు. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలని,కొల్లాపూర్ ప్రాంత అభివృద్దే మన అందరి ధ్యేయం అని, అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. సిఎం.కేసీఅర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో భవిష్యత్తులో కొల్లాపూర్ నియోజకవర్గంను అభివృద్దిలో మరింత ముందుకు తీసుకుపోదమని పిలుపునిచ్చారు.