మంత్రి హరీష్ రావు ఇచ్చిన పేదల ఇండ్లను ఎందుకు రద్దు చేశావు

మంత్రి హరీష్ రావు ఇచ్చిన పేదల ఇండ్లను ఎందుకు రద్దు చేశావు
  • లంచాల కోసమా ఇతరులకు అమ్ముకోవడానికా!?
  • ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పైర్ ఐన బీజేపీ నేత దేవని సతీష్ మాదిగ

ముద్ర, అచ్చంపేట23: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేదలకు ఇళ్లను పంపిణీ చేశారు. కలెక్టర్' ఆర్డిఓ తహసిల్దార్,' మున్సిపల్ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన పేదల ఇండ్లను వారికి కేటాయించకుండా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడ్డుకుంటున్నారని అధికారులు ఎంపిక చేసిన వారిని కాకుండా లంచాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని అచ్చంపేట నియోజకవర్గం బిజెపి నేత దేవని సతీష్ మాదిగ ఆరోపించారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలో నిర్మించిన నూతన బెడ్ రూమ్ ఇండ్ల సందర్శనకు వెళుతున్న బిజెపి నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. సతీష్ మాదిగను తన ఇంటిలోనే గృహనిర్బంధం చేసి అరెస్ట్ చేశారు. అదేవిధంగా పట్టణంలోని బిజెపి నాయకులను అరెస్ట్ చేసి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు  తరలించారు.

ఈ సందర్భంగా సతీష్ మాదిగ స్థానిక మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిజమైన పేద ప్రజలకు అందకుండా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గువ్వల బాలరాజు అక్రమాలకు వచ్చే మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో అడ్డుకట్ట వేయడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఘోరంగా ఓడించి ఆయన స్వగ్రామం గోపాల్ పేట  మండలం పోల్కేపాడుకు పంపడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.