అక్రమంగా జెలాటిన్ స్టిక్స్  నిల్వ ఉంచుతే కఠిన చర్యలు...

అక్రమంగా జెలాటిన్ స్టిక్స్  నిల్వ ఉంచుతే కఠిన చర్యలు...
  • ఎస్పీ అఖిల్ మహాజన్...

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :ప్రజల నివాస ప్రదేశాల్లో అక్రమంగా జిలిటెన్ స్టిక్స్ మరియు పేలుడు పదార్థాలు  అక్రమంగా నిలువ ఉంచితే కఠిన చర్యలు తప్పవని  ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. చిన్న బోనాలలో అక్రమంగా జిలిటెన్ స్టిక్స్  ను నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు  అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.  ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చిన్న బోనాల లో బంగారయ్య అద్దె కున్న  ఇంటిలో  అక్రమంగా జిలిటెన్ స్టిక్స్ నిలువ ఉంచాడని విశ్వనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, ప్రమాదకరంగా నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్,వాటిని పేల్చడానికి ఉపయోగిచే కార్డేక్స్ వైర్ స్వాధీన పరచుకొని,అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

బంగారయ్య   విచారించగా దాదాపు ఆరు నెలల క్రితం వల్లెపు తిరుపతి వద్ద ఒక కాటన్ జిలిటెన్ స్టిక్స్ స్టిక్స్ కొనుగోలు చేసి,  కొన్నింటిని ఉపయాయోగించి, మిగతా వాటిని నిల్వ ఉంచాడని అన్నారు. ఆస్తి మరియు ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసి కూడా, అక్రమంగా నివాస స్థలాల్లో ఎటువంటి  అనుమతులు లేకుండా నిలువ ఉంచాడని  బంగారయ్య ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న వల్లెపు తిరుపతి నీ  త్వరలో తిరుపతిని అరెస్టు చేస్తామని తెలిపారు ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా,లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠినచర్యలు తీసుకుంటామని, జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు ఎవరైనా వినియెగించాలనుకుంటే దానికి సబంధిచిన అనుమతి,లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. జెలాటిన్ స్టిక్స్ వంటి పదార్థాలు ఎవరైనా నిల్వ ఉంచుకున్న,ఎవరి దగ్గరైన అయిన ఉన్నాయన్న సమాచారం ఉన్న డయల్ 100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.ఈ  సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ ఉదేయ్ రెడ్డి,టౌన్ సిఐ ఉపేందర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..