ఉప్పల్ బిఆర్ ఎస్ అభ్యర్థిగా.. బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ బిఆర్ ఎస్ అభ్యర్థిగా.. బండారి లక్ష్మారెడ్డి
  • మిఠాయిలు పంచి... బాణసంచా కాల్చి... బండారి అనుచరుల సంబరాలు

ముద్ర , కుషాయిగూడ: ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడానికి హర్షిస్తూ... పార్టీ నాయకులు కార్యకర్తలు బండారి అనుచరులు సంబరాలు నిర్వహించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి బండారి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడంతో... బండారి అనుచరులు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి మిఠాయిలను పంచారు.

ఈ సందర్భంగా చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ ప్రధాన రోడ్ లో ప్రదర్శన నిర్వహించి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు అనుకూలంగా నిదానాలు చేశారు. అనంతరం ప్రదర్శనగా సైనిక్పురిలోని బండారి లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, నెమూరి మహేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, బుచ్చిరెడ్డి,  వెంకిరాల నరసింహ ముదిరాజ్, యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు