జర్నలిస్ట్  మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కలెక్టర్ కు వినతి

జర్నలిస్ట్  మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కలెక్టర్ కు వినతి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా పరిధిలో మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబలకు అందాల్సిన పరిహారం జాప్యంను నిరసిస్తూ టియుడబ్య్లుజే (ఐజేయు)  ఆధ్వర్యంలో జర్నలిస్టు నాయకులు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో మరణించిన సుమారు 10 మంది జర్నలిస్ట్ ల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ నుంచి అందాల్సిన రూ.1 లక్ష పరిహారం, నెలకు అందల్సిన రూ.3000/- పెన్షన్ ఏడాది గడిచిన బాధిత కుటుంబాలకు అందడం లేదన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రెస్ అకాడమికి విజ్ఞప్తి చేసినప్పటికి అకాడమీ స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు.

కుటుంబ పెద్దను కోల్పోయి, దీన స్థితిలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందక, ఆర్థికంగా చితికిపోయిన మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటూన్నాయన్నారు. జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఈనెల 30 లోపు పరిహారం అందేలా చూడాలని, లేని పక్షం లో ప్రజాస్వామ్య పద్దతిలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బాధిత కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో  టియుడబ్య్లుజే(ఐజేయు) జాతీయ కౌన్సిల్ సభ్యులు సురేందర్ కుమార్, సంఘ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పూడూరి శోభన్, పాత్రికేయులు సామ మహేష్, సాబీర్ తదితరులున్నారు.