దుబాయిలో ఘనంగా వేదవ్యాసుడు వేడుకలు

దుబాయిలో ఘనంగా వేదవ్యాసుడు వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గంగపుత్రుల అదిగురువు వేద వ్యాస మహర్షి వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. వ్యాస గురు పౌర్ణమిని పురస్కరించుకొని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి ఆధ్వర్యంలో వేద వ్యాసుడి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మన ప్రాచీన వేదాలను లిఖితపూర్వకంగా అందించిన అదిగురువు వేద వ్యాసుడు జన్మించిన రోజునే వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణమిగా పిలుస్తారన్నారు. గంగపుత్రుల జాతి రత్నం వేదవ్యాసుడు కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు.

వ్యాస మహర్షిని పూజించే వారికి గురుకృపతోపాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని తిరుపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు తోకల శంకర్,కార్యదర్శి బోరే ఇందయ్య, కోశాధికారి సముద్రాల నరేష్, మేడి రమేష్, గౌరవ సలదారులు పల్లికొండ రాములు, బోరే రాజన్న, నిర్మల్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు, నర్సింలపల్లె అధ్యక్షులు మేడి రాములు, రాంపూర్ అధ్యక్షులు పందిరి రాజేష్, రాంపూర్ కార్యదర్శి కొండ్రు నారాయణ, చింతలపల్లి అధ్యక్షులు జింక నరసయ్య, తాళ్లపేట అధ్యక్షులు నెన్నెల రాజేష్, వెల్గటూర్ గౌరవ సలదారులు గుమ్ముల నరేష్, హనుమంతుపల్లి కార్యదర్శి బోరె రాకేష్, ధర్మారం ఉపాధ్యక్షులు పందిరి చంద్రయ్య, నంబాల గౌరసలదారులు పల్లికొండ సురేష్ పాల్గొన్నారు.