నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది: మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్

నిరుద్యోగుల ఆశలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది: మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్
  •  మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్
  • నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయాలి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : కోట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు అంధకారంగా మారాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై  నీళ్లు చెల్లిందని బిజెపి నేత,  మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలోవిలేకరుల సమావేశం మాట్లాడుతూ టీఎస్పీఎస్పీ పేపర్ లేకేజి ఘటనపై నేటికీ సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దురదృష్టకరం అన్నారు. పేపర్ లేకేజి తో రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ఆగం అవుతుంటే, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  కేవలం ఇద్దరు ఉద్యోగులను బాధ్యులను చేయడం విచారకరం అన్నారు.
తప్పు చేస్తే తన సొంత బిడ్డలను భర్తరఫ్ చేస్తామన్నారు కేసీఆర్, పేపర్ లేకేజి ఆరోపణపై మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. శనివారం జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్, నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్  పిలుపుమేరకు జిల్లా నాయకులు, నిరుద్యోగులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్  మదన్ మోహన్,  జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, రంగు గోపాల్ , లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.