ఎంపీపీగా రవళి ఎన్నిక...

ఎంపీపీగా రవళి ఎన్నిక...

ముద్ర, మల్యాల : మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆగంతపు రవలి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. అంతకు ముందు బిఆర్ఎస్ ఎంపిపీగా కొనసాగిన మిట్టపల్లి విమల ఫై అవిశాస్వాస తీర్మానం పెట్టగ ఆమె పదివిని కోల్పోగా ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన  ఎంపీపీ ఎన్నికలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా, 7 కాంగ్రెస్, ఒకరు బిజేపీ ఎంపిటిసి సభ్యులు హాజరయ్యారు.

రవళిని ఎంపీపీగా తాటిపల్లి ఎంపీటీసీ అనిత ప్రతిపాదించగా, రాంపూర్ ఎంపీటీసీ సభ్యురాలు పద్మ బలపరిచారు. ఒకే ఒక నామినేషన్ రావడంతో రవళి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ఆర్దిఒ ప్రకటించారు. ఈ సందర్బంగా చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంపీపీ రవళిని అభినందించి, శాలువతో సత్కరించారు. అనంతరం ఎంపీపీ రవళి మాట్లాడుతూ... మండలంలో అన్ని విధాల అభివృద్ధికి పనులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.