గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ - మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ కాంగ్రెస్‌లో చేరిక !

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ - మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ కాంగ్రెస్‌లో చేరిక !

ముద్ర,హైదరాబాద్:- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు.లోక్ సభ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి  భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) పంపారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో  చేరారు. బాబా ఫసీయుద్దీన్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపదాస్‌ మున్షి. 

పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా కష్టపడ్డా అని మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు. భవిష్యత్‌ లేకుండా కొంతమంది కుట్ర చేశారని పేర్కొన్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో…

“ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు నాకు నచ్చలేదు. పార్టీ అవిర్భావం నుంచి నేను కష్టపడి పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేసాను. అలాంటి నాకు రాజకీయ భవిష్యత్ లేకుండా కొందరు. నాయకులు కుట్ర చేస్తుంటే అధినాయకత్వం వారిపై కనీస చర్యలు తీసుకోక పోగా, వారికే మద్దతు ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అధినాయకత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ప్రయోజనం కనపడలేదు. గుండెల నుండా గులాబీ జెండాతో 22 ఏళ్లు పార్టీకోసం సిపాయిగా పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైంది. అందుకే నేను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, మీడియా స్పోక్సపర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను.” అంటూ లేఖలో పేర్కొన్నారు.