లావాదేవీల కోసమో అవిశ్వాసం బుచి 

లావాదేవీల కోసమో అవిశ్వాసం బుచి 
  • తీర్మానాలలో అవకతవలపై ఆగ్రహం:-  
  • భాజపా  పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి

ముద్ర,రాయికల్ :- రాయికల్ పట్టణంలోని జెఏసి ప్రెస్ క్లబ్ లో భారతీయ జనతా పార్టీ పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఇట్టి సందర్భంగా పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి  మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పేరా లావాదేవీల కోసం బిఆర్ఎస్ కౌన్సిలర్ లు బూచి చూపారని,ప్రజలను తప్పు దోవ పట్టించి వాళ్ళ నాయకులతో లావాదేవీలు  జరుపుకుని అవిశ్వాసం విరమించి ప్రజలను తప్పు దోవ పట్టించారని అన్నారు.

ఇష్టారీతినా తీర్మానాలు 

గతంలో ప్రతిపక్ష కౌన్సిలర్ లు హాజరయ్యి సమావేశ హాజరు పట్టికను వాడుకుని ఇష్టారీతిన తీర్మానాలు చేసుకున్నారని,ఒక దానికి ఒకటికి పొంతన లేని తీర్మానాలు చేసి కొన్ని చోట్ల పనులు చెయ్యక బిల్లులు తీసుకోని మున్సిపల్ నిధులు తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.

చెత్త వాహనాల డీజిల్, పెట్రోల్ ఖర్చులలో కూడా అవినీతి 

చెత్త వాహనాల డీజిల్,పెట్రోల్ ఖర్చు లకు లక్షలాది రూపాయలను ఇష్టారీతిన అవినీతి చేశారనిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు స్పందించి రాయికల్ మున్సిపల్ పై ప్రత్యేక చర్యలు తీసుకొని విచారణ జరిపి అవినీతి సోమ్ము ను వెలికితీసి పట్టణ ప్రజలకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సామల సతీష్, కిషన్ మోర్చ జిల్లా నాయకులు కుర్మా మల్లారెడ్డి,కోశాధికారి తోకల శంకర్ , బిజేవై ఎం పట్టణ ఉపాధ్యక్షులు సుమన్,ఎల్లా గౌడ్,రాహుల్,నరేష్, ఆర్మూర్ శంకర్,తదితరులు పాల్గొన్నారు.