మూసి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు.

మూసి నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు.

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూరు మండలం దత్తప్పగూడెం వద్దగల మూసి నది నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గురువారం సుమార్  50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను తరలించి వ్యవసాయ బావుల వద్ద కుప్పలు పోసుకొని రాత్రి వేళలో లారీలతో తరలిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రామన్నపేట మండలం తుర్కపల్లి గ్రామం రైతులు కొండ్రాతి సత్తయ్య కొండ్రాతి వెంకటయ్య కొండ్రాతి బక్కయ్య బాసని మల్లయ్య  తమ బోర్లు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు నాలుగు నెలలుగా రేయింబవళ్లు ట్రాక్టర్లతో ఈ వ్యవహారం నడుస్తుంది. దత్తప్పగూడెం పరిధిలోని నాగుల బండ నుంచి పొడిచేడు ప్రాంతం వరకు మూసివెంట ఈ ఇసుకను తరలించి కొందరు తమ బావల వద్ద రాశులు పోసుకుంటున్నారు రాత్రి వేళల్లో లారీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమ ఇసుక తరలింపును నిరోధించాలని రైతుల కోరుతున్నారు. ఈ విషయమై మోత్కూర్ తహసిల్దార్ రాం ప్రసాద్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి  పిర్యాదులు అందలేదని తెలిపారు.