బండి సంజయ్‌... గుడ్‌ లుక్స్‌...

బండి సంజయ్‌... గుడ్‌ లుక్స్‌...
bandi sanjay

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికలకు పదేళ్లు పవర్‌ లో ఉన్నట్లవుతుంది. అయితే తెలంగాణలో ఈ పదేళ్ల కాలంలో అనేకమంది బీజేపీ అధ్యక్షులు పనిచేశారు. అందరికీ గుర్తింపు లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ కు తొలుత జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడి పదవి పార్టీ పరంగా ఇచ్చారు. అనంతరం లక్ష్మణ్‌ ను ఏకంగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఆయన రాజ్యసభ పదవికి ఎంపిక అయ్యారు. 2016 నుంచి 2020 వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ బాధ్యతలు వహించారు.ఇక కిషన్‌ రెడ్డి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.

కిషన్‌ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకూ ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌ రెడ్డి, 2018లో అంబర్‌ పేట్‌ నుంచి ఓటమి పాలయినా ఆయనకు సికింద్రాబాద్‌ పార్లమెంటు టిక్కెట్‌ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఏకంగా మోదీ కేబినెట్‌ లో సహాయ మంత్రిగా తీసుకున్నా తర్వాత ఆయనకు స్వతంత్ర హోదా కలిగిన శాఖను మంత్రిగా చేశారు. ఇక గతంలో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండారు దత్తాత్రేయను గవర్నర్‌ గా పంపి గౌరవించుకున్నారు. పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి పార్టీ అధినాయకత్వం గుర్తించి గౌరవిస్తుందన్నది ఇందుకు ఉదాహరణ. ఇక ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ అధినాయకత్వం గుడ్‌ లుక్స్‌ లో ఉన్నారు. గత అధ్యక్షులు చేసిన శ్రమ కారణం కావచ్చు. మారిన రాజకీయ పరిస్థితులు కావచ్చు. తెలంగాణలో బీజేపీ బలపడిరదని చెప్పాలి.

దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణను గేట్‌ వేగా పార్టీ హైకమాండ్‌ భావిస్తుంది. బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కమలం పార్టీ మరింత పుంజుకుంది. కాంగ్రెస్‌ బలహీనపడటంతో ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే వీలు కలిగింది.అందుకే బండి సంజయ్‌ కు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉందని పార్టీలో అంచనాలు వినపడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్‌ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని ఢల్లీి స్థాయిలో కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా బండి సంజయ్‌ మోదీ, అమిత్‌ షా గుడ్‌ లుక్స్‌ లో ఉన్నారు. ఆయన పార్టీ కోసం పాదయాత్ర కూడా చేశారు. చేస్తున్నారు కూడా. కొంత పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేశారని అధినాయకత్వం నమ్ముతుంది. అందుకే బండి సంజయ్‌ కు భవిష్యత్‌ లో పదవులు వాటంతట అవే వచ్చి పడతాయన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్‌. కరీంనగర్‌ లో ఒక సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై.. త్వరలోనే అత్యున్నత పదవి కూడా లభిస్తుందన్నది ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.