ప్రతి విద్యార్థి ధారాళంగా చదివేందుకు ప్రత్యేక కార్యక్రమం

ప్రతి విద్యార్థి ధారాళంగా చదివేందుకు ప్రత్యేక కార్యక్రమం
  • బాలికల పాఠశాలలో విద్యార్థులకు పఠన ఉత్సవం
  • యస్.సి.ఇ.ఆర్.టి. విద్యాప్రణాళికా విభాగం కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్ 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో యస్.సి.ఇ.ఆర్.టి. విద్యాప్రణాళికా విభాగం కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్  పటన ఉత్సవము కార్యక్రమాన్ని సోమవారం నాడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ  పఠన ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైందని,ఇది జూలై 31 వరకు కొనసాగుతుందని సువర్ణ వినాయక్ తెలిపారు. ప్రతి విద్యార్థికి ధారంళంగా చదవడం రావాలని, చదివిన దానిని అర్ధం చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి తరగతికి ప్రతీ రోజు గ్రంథాలయ పిరియడ్ను కేటాయించి, ఉపాధ్యాయులు చదవలేని విద్యార్థులను చదివేటట్టు చూడాలన్నారు. ప్రతీ విద్యార్థి ధారాళంగా  చదివే స్థితికి రావాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల పఠనాసామర్థ్యాన్ని పరిశీలించారు.స్థానిక వన్ టౌన్ సి.ఐ. భిక్షపతి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రీడింగ్ ఎలా చేయాలో,ఒక కథాపుస్తకం చదివి వినిపించారు. 

యమ్.ఇ.ఓ.యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదవగలిగినప్పుడే విషయాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుందని చెప్పారు.జిల్లా విద్యాశాఖ పక్షాన సహాయ అధికారి భాస్కర్  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగే పఠనేత్సవం" సిద్దిపేట జిల్లాలో ప్రారంభించడం సంతో షకరమన్నారు.ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు తగు సూచనలు. సలహాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెంటర్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధి సురేష్, రూమ్ టు రీడ్ ప్రతినిధులు తేజస్విని రవి పాల్గొన్నారు.  యస్.ఎమ్.సి. చైర్మెన్,స్థానిక కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం, యమ్.ఎన్.ఓ. వెంకటేశం, పాఠశాల హెచ్.ఎమ్. నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు మాధవి,యాస్మిన్, మేఘమాల,ఖైసర్, చంద్రకళ,రేష్మ పాల్గొన్నారు.