ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు..

ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు..
  • కూలీలకు ప్రోత్సాహం కరువు...
  • పని ప్రదేశాల్లో కనిపించని సౌకర్యాలు...
  • పట్టిచుకొని ఉన్నతధికారులు..

గొల్లపల్లి. ముద్ర:- జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పని చేస్తున్న కూలీలకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు.గొల్లపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నా కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పని ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గాను టెంట్లు,తాగేందుకు నీటి వసతి,గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఓ ఆర్ స్ ప్యాకెట్లు ఇవేవి అందుబాటులో లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలు కొద్ది సేపైనా సేద తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది.

కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు స్థానికంగా నిల్వ నీడ కరువవుతోంది. దీంతో చెట్ల కింద,కొందరు సేద తీరుతున్నారు. దూర ప్రాంతాల్లో పని చేసేందుకు రవాణా వసతి కల్పించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ కూలీలు మండుటెండులను సైతం లెక్క చేయకుండా కనీస సౌకర్యాలు కల్పించనప్పటికీ కూడా పనులు చేస్తున్నా సకాలంలో డబ్బులు అందడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.కూలీలకు విధిగా వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా మండల స్థాయిలో అధికారులు పట్టించుకోవడంలేదని  కూలీలు చెపుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  కూలీలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ న్నారు.