సింగిల్ విండో సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి - డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
ముద్ర,పానుగల్:- సింగిల్ విండో సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్,పానుగల్ సింగిల్ విండో చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.బుధవారం పానుగల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండో ద్వారా ఎరువులు,విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు.పానుగల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులకు 34,30,94000 రూపాయలను పంట రుణాలను ఇవ్వడం జరిగిందని,2,78,89,855 రూపాయలను దీర్ఘకాలిక రుణాలను రైతులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.స్వయం ఉపాధి పథకం ద్వారా 1,95,95,554 రూపాయల రుణాలను అందజేసినట్లు తెలిపారు.
రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలన్నారు.రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందా అనే సందేహం రైతుల్లో ఉంది.రెన్యువల్ కు, ఋణమాఫీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.రైతులకు పట్టాదారు పాసుపుస్తకం వుంటే ఎడ్యుకేషన్ రుణాలు,నూతన ఇంటి నిర్మాణాలకు కూడా సింగిల్ విండో ద్వారా రుణాలను మంజూరు చేస్తామన్నారు.రైతుల శ్రేయస్సు కోసం గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.ప్రభుత్వ భూములకు పంట రుణాలను ఇవ్వాలని రైతులు కోరగా ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లడం జరిగిందన్నారు.నూతన ప్రభుత్వానికి,స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కు చైర్మన్ తో పాటు విండో డైరెక్టర్లు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు మునీరుద్దిన్,సింగిల్ విండో వైస్ చైర్మన్ బాలయ్య వివిధ గ్రామాల డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, ప్యాట బాలరాజు,సాయి ప్రసాద్ గౌడ్,జయమ్మ, ఎల్లస్వామి,నిరంజన్ రెడ్డి, సీఈవో భాస్కర్ గౌడ్, సింగిల్ విండో సిబ్బంది రాఘవేందర్ రెడ్డి,వేణు,అమీర్,భరత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.