మారేడు పల్లిలో భార్యను కడతేర్చిన భర్త..

మారేడు పల్లిలో భార్యను కడతేర్చిన భర్త..

వెల్గటూర్, ముద్ర :  తాగిన    మైకంలో  ఓ వ్యక్తి తన భార్య   తల పై ఇనుపరాడుతో మోది హత్య చేసిన సంఘటన   జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని, మారేడుపల్లి గ్రామంలో కలకలాన్ని సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎండపల్లి మండలం లోని, మారేడుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ వ్యాల్ల పున్నం రెడ్డికి,ధర్మారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రజితకు 13 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కాగా వీరి కాపురం కొన్నాళ్ల పాటు  సవ్యంగానే సాగింది. వీరి కాపురానికి గుర్తుగా ఓ 11 ఏళ్ళ పాప జన్మించింది .

గత కొంతకాలంగా పున్నం రెడ్డి తాగుడుకు బానిస  య్యాడు. దీనితో కుటుంబంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా  బార్య రజిత తో గొడవ జరిగిం ది.  ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో పున్నమిరెడ్డి  ఆవేశానికి లోనైన,సహనాన్ని కోల్పోయి ఇనుప రాడుతో భార్య రజిత తలపై బలంగా కొట్టగా ఆమె తలకు గాయమై తీవ్రంగా రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కాగా వారి గొడవకుసంబందించిన కారణాలు తెలియ రాలేదు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు  పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని  హత్య సంబందించిన వివరాలను సేకరిస్తున్నారు.