పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని

పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన ఇంటర్ విద్యార్థిని

ఖమ్మం, ముద్ర:  నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ శ్రీ చైతన్య కళాశాల పరీక్షా కేంద్రంలో  ఇంటర్ మొదటి సంవత్సర బైపీసీ విద్యార్థిని పత్రి దీపిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెను పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ మదర్, కానిస్టేబుల్ సాయి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉంది. ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఖమ్మం నగరంలోని సిరి చైతన్య లో ఆమె బై. పిసి. మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం బొటని పరీక్ష కోసం ఆమెను పరీక్ష కేంద్రం వద్ద ఎనిమిది గంటలకు బాబాయి కిరణ్ కుమార్ ద్విచక్ర వాహనం దింపి వెళ్లిపోయారు.

ఆమె మూడో ఫ్లోర్ లోని పరీక్ష హాల్ కి వెళ్ళింది.  కొద్దిసేపటికి కిందకు దిగి బాత్రూంకు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హుటాహుటిన పరీక్ష కేంద్ర సిబ్బంది సమాచారం తో ట్రాఫిక్ పోలీసులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె చదివే కళాశాల బాధ్యులు సోమయ్య దగ్గరుండి కుటుంబ సభ్యుల సహకారంతో వైద్య సేవలు అందజేస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్ష ఆమె రాయలేకపోయింది. కళాశాల టాపరని  లెక్చరర్ లు తెలిపారు. అస్వస్థ గురిగవ్వడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.