కమ్యూనిస్టు నేతలు ఆలోచించాలి: కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు నేతలు ఆలోచించాలి: కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి

కామేపల్లిలో కామ్రేడ్లపై ఘాటు వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి,  ఖమ్మం: రైతులు, నిరుద్యోగులు తదిత వర్గాలు సమస్యలతో పోరాడుతుంటే కమ్యూనిస్టులు పాలక పార్టీ అయిన బిఆర్ఎస్ తో పొత్తుల కోసం గడీల బానిస బతుకు కోసం వెంపర్లాడుతున్నాయని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహబూబాద్ జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాలు జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, సిపిఐ నేత కూనంనెని సాంబశివరావు బిఆర్ఎస్ పొత్తు విషయంలో పునర్ ఆలోచించాలని సూచించారు. కమ్యూనిస్టులు నేతలు, కార్యకర్తలు ఆలోచించి కాంగ్రెస్ కు అండగా నిలవాలని  కోరారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి బిఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీయాలని రేవంత్ అన్నారు.

వారిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకు భాజపా నేతలు కిషన్ రెడ్డి , బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. లేదంటే బిజెపి, బి ఆర్ ఎస్ లోపాయకారిగా పని చేస్తున్నాయనే విషయం వెళ్లడవుతుందన్నారు. 1969 లో తెలంగాణ ఉద్యమం పాల్వంచలో పుట్టిందని, 2003లో విద్యుత్ ఉద్యమం సైతం ఖమ్మంలో పుట్టిందని రానున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించాలంటే ఖమ్మం నుంచి ఆ చైతన్యo రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

 ఆయన మరణిస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన భార్యకు టికెట్ ఇచ్చిందని  కేసీఆర్ కు సానుభూతి లేకుండా ఆమెను ఓడించారని ఆ ఉసురు తెలంగాణ లో జరిగిన వరసగా  రెండు ఎన్నికల్లో కెసిఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెలిచిందని  పిసిసి చీఫ్ రేవంత్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఆస్తులపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి లో వెయ్యి ఎకరాల భూములు గోల్మాల్ జరిగిందన్నారు. 111 జీవో నుంచి మంత్రి కేటీఆర్ వెయ్యి ఎకరాల భూమిని మినహాయించారని చెప్పారు. రూ.5 వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని 2024 జనవరి 26న బయ్యారం ఉక్కు కర్మాగారం శిలాఫలకం ప్రారంభోత్సవం కోసం  కాంగ్రెస్ నేతలు భట్టి, రేణుక తో కలిసి వస్తానని రేవంత్ జోష్యం చెప్పారు. విలేకరులు తేదీ రాసుకోవాలని సూచించారు. రేవంత్ పర్యటనలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, రామ్ రెడ్డి సోదరులు పాల్గొన్నారు.