సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి  కేటీఆర్

సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి  కేటీఆర్

ముద్ర ఖమ్మం/హైదరబాద్: బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పార్టీ శ్రేణులు కాల్చిన బాణాసంచా వల్ల ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడి ఓ పూరి గుడిసె పై పడటం ఆ గుడిసెకు అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న సిలిండర్ పేలడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో గాయపడిన క్షతగాత్రులను బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు , రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. ఆయన వెంట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,పార్టీ లోక్ సభ పక్ష నాయకులు  ,ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు.

నిమ్స్ ఆస్పత్రి డాక్టర్ బృందంతో మంత్రి కేటి ఆర్ మాట్లాడారు. ఏ  విధంగా వైద్య సేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రులను పరామర్శించి,వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు . ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప , ఓఎస్డీ గంగాధర్ డాక్టర్ల బృందం పాల్గొన్నారు .