కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్: రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్: రాహుల్​ గాంధీ

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు ఇచ్చే పెన్షన్లను రూ. 4 వేలకు పెంచుతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్​ అంటేనే పేదల పార్టీ అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్​ నియంత పాలన చేస్తున్నాడని, పేదల భూములన్నీ కేసీఆర్​ చేతుల్లో ఉన్నాయని విమర్శించాడు. గిరిజనులకు కాంగ్రెస్​ ప్రభుత్వం భూములు ఇచ్చిందని, కేసీఆర్​ వాటిని లాక్కుంటున్నాడని, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే వెంటనే గిరిజనులందరికీ భూములు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఖతం అయిందని, అడ్రస్​ లేకుండా పోయిందరని రాహుల్​ గాంధీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు బీజేపీ బీ టీం అని అన్నారు.