దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 55,03,980 విరాళం ఇచ్చిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్

దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 55,03,980 విరాళం ఇచ్చిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్

ముద్ర యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దివ్య విమాన గోపురం స్వర్ణ  తాపడానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కీర్తి వివేకానంద గౌడ్ రూపాయలు 55 లక్షల 3 వేల  980 విరాళం సమర్పించారు. ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి తో కలిసి ఇందుకు సంబంధించిన నగదు ను ఆలయ డిఇఓ దోర్బల భాస్కర్ శర్మకు అందజేశారు. మీ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి వచ్చే ప్రతి విదేశీయులు యాదగిరిగుట్టకు వచ్చి దర్శించుకునే విధంగా విధంగా ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని తెలిపారు.

స్వామి వారి దయతో మహారాష్ట్రలో సైతం బి ఆర్ ఎస్ జెండా ఎగరబోతుందన్నారు. స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం సమర్పించామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరము కృష్ణ్నారావు పాల్గొన్నారు.