ఘనంగా శ్రీ సంతోషి మాత జన్మదిన వేడుకలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు..

ఘనంగా శ్రీ సంతోషి మాత జన్మదిన వేడుకలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు..
  • భక్తులకు ప్రసాద వితరణ...

ముద్ర ప్రతినిధి భువనగిరి :పట్టణంలోని ఖిల్లా వద్ద గల శ్రీ సంతోషిమాత దేవాలయంలో గురువారం శ్రీ సంతోషిమాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి పండగ ఆలయ కమిటీ చైర్మన్ తాడూరు చంద్రయ్య అధ్యక్షతన ఆలయ పూజారులు మణిశర్మ,వెంకటేష్ లు అమ్మవారిని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.  ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి లను ఆలయ కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టబోయిన గోపాల్, తాడూరి బిక్షపతి, వెల్దుర్తి రఘునాథ్, నరాల శంకర్, కందికొండ సహదేవ్, చిన్న గారి బలరాం, రామాంజనేయులు,దశరథ, శ్రీనివాస్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.