వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం: యూపీ మాజీ సీఎం, సమాజ్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్

వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం: యూపీ మాజీ సీఎం, సమాజ్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్
akhilesh yadav speech in khammam meeting

యూపీ మాజీ సీఎం, సమాజ్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ... ఎంతో పోరాట స్ఫూర్తి ఉన్న ఖమ్మం జిల్లాలో ఇలాంటి సభ నిర్వహించడం అభినందనీయం. ఖమ్మం సభ ద్వారా  దేశానికి మంచి సందేశం ఇస్తున్నారు. పక్కనే ఉన్న కొత్త కలెక్టరేట్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుందో అర్థం అవుతోంది. కేంద్రంలో ప్రశ్నించే నేతలను ఇబ్బందులు గురి చేస్తున్నారు . ఎన్నికైన కొత్త ప్రభుత్వాలను కూడా వేధిస్తోంది. 

వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదు. g20 అంశాన్ని ఎన్నికల కోసం మోడీ వాడుకుంటున్నారు. తెలంగాణలో బిజెపిని ప్రక్షాళన చేస్తున్నారు. యూపీలోను బిజెపిని గద్దె దించేందుకు కృషి చేస్తామన్నారు. అఖిలేష్ హిందీలో ప్రసంగించారు.