గ్రూప్ 1 లీకేజి పై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి...

గ్రూప్ 1 లీకేజి పై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి...

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: టిఎస్పిఎస్సి గ్రూప్ 1 లీకేజీ పై సిబిఐ లేదా సెట్టింగ్ జడ్జితో  విచారణ చేపట్టాలని బిఎస్పి జిల్లా అధ్యక్షుడు వర్ధవెళ్ళి స్వామీగౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి  అంకం భాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ఆర్డిఓ ఆఫీస్ ఎదుట బీఎస్పీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరo ఏవో కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నిరుద్యోగ యువతను అగాథం లోనికి నెట్టే విధంగా ఉన్న టీఎస్పీఎస్సీ  గ్రూప్ 1 లీకేజిపై సిబీఐ చేత దర్యాప్తు చేయడంలో కేంద్రప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ,కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమయం ఉందనే అనుమానాలు ఉన్నందునా కచ్చితమైన స్వతంత్ర ప్రాతిపదిక కల్గిన సంస్థ చేతమాత్రమే దర్యాప్తు చేయించాలని ,ఆరోపణలు ఎదుర్కొంటున్న  చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సభ్యులను వెంటనే భర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్రమైన విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు.  ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మ్యాకల మునీందర్,ఉపాధ్యక్షుడు గుగులోతు చంద్రూనాయక్,ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు, కార్యదర్శులు లింగంపల్లి మధూకర్,బొడ్డు మహేందర్,సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉపాద్యక్షుడు తాటిపెల్లి  అంజయ్య,కార్యదర్శి ఈసంపెల్లి కొంరయ్య, వేములవాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాలె నీలకంఠం,అయా మండలాల అధ్యక్షులు కోరుట్ల రమేష్,జింక నాగరాజు, తెడ్డుశేఖర్,నాయకులు జోగెల్లి శ్రీనివాస్, చిరంజీవి, తడగొండ సాయిలు,కొప్పెల్లిరాజు,మల్లారం నవీన్, తదితరులు పాల్గొన్నారు.