వైరాలో బీఆర్ఎస్ పార్టీను గెలిపించే బాధ్యత నాదే: మంత్రి పువ్వాడ

వైరాలో బీఆర్ఎస్ పార్టీను గెలిపించే బాధ్యత నాదే: మంత్రి పువ్వాడ
Vira Minister Puvwada

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీను గెలిపించే బాధ్యతను తాను స్వీకరిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మాటే సీఎం కేసీఆర్ కు చెప్పానని వివరించారు. పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేయాలని మాజీ ఎంపీ పొంగులేటికి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీ బీఫామ్ తో గెలిచిన వారిని మాత్రమే తాము సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కక్కిన కూడే అన్నారు. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన వారు ఎన్ని రోజులు పదవుల్లో కులుకుతారో కులకoడంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన వారికి నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విజయం తనదేనని దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, వైరా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.