ఇథనాల్ ఫ్యాక్టరీతో నష్టం లేదని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పు కుంటా..

ఇథనాల్ ఫ్యాక్టరీతో నష్టం లేదని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పు కుంటా..

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్, ముద్ర: ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వలన అక్కడి ప్రజలకు ఎటువంటి నష్టం జరగదని మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరూపిస్తే  కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ ను వెనక్కి తీసుకొని, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని పాశిగామ గ్రామం వద్ద అక్కడి గ్రామస్థులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు కలుగు తుందంటే గ్రామ ప్రజలకు తెలియకుండా పనులను ప్రారంభించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అన్ని శాఖల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే పాశిగామ గ్రామస్థులను కలిసి వారితో మాట్లాడటం జరిగిందని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్  ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  పైన  ఈ ఫ్యాక్టరీ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తేదీ, సమయం చెప్పండి మీరు మేము ప్రజలతో కలిసివెళ్లి ఇటువంటి ఫ్యాక్టరీ ఉన్న పర్లపెల్లి ,నారాయణఖేడ్ కి వెళ్లి అక్కడ ప్రజలను అడిగి నిజానిజాలు తెలుసు కుందా మని అన్నారు. 

సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంత్రికి లేదని, ఎప్పుడు ఇతర పార్టీలల్లో గల నాయకులను ఏ విధంగా తన పార్టీలోకి తీసుకురావాలనే దాని పైనే ఆయన ఆలోచన ఉంటుందని ఎద్దేవా చేశారు. మంత్రికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, జీతాలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో వారి పైన విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 2004 ముందు మంత్రి కొప్పుల  ఈశ్వర్  ఆస్తులు ఎంత..? 2023 నాటికి అతడి ఆస్తులు ఎంతున్నాయో ప్రజలకు తెలపాలని అన్నారు. కాలేశ్వరం లింక్ 2 పేరిట ఈ ప్రాంతంలో 700 ఎకరాలు మూడు పంటలు పండే భూములను  పోలీసులను, అధికారులను పెట్టి, రైతులను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా  లాక్కున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ముత్తునూర్ ఎంపీటీసీ అనుమలా మంజుల, మండల యువజన విభాగం అధ్యక్షుడు పుదరీ రమేష్ నాయకులు .గుండేటీ సందీప్ రెడ్డి, చెన్న కుమార స్వామి ,నల్ల తిరుపతి , బొరకుంట రాజయ్య దుంపట సత్యం ,.కొత్త హరీష్ ,మేకల పోచయ్య బైరం రెడ్డి, నాయకులు .గొల్ల తిరుపతి ,వెంకటస్వామి, సత్యనారాయణ రావ్, ఉదయ్ గౌడ్, కుస లక్ష్మణ్ మేరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.