35 బైకుల సౌండ్ పోల్యుషన్ సైలెన్సర్లను తొలగించిన పోలీసులు

35 బైకుల సౌండ్ పోల్యుషన్ సైలెన్సర్లను తొలగించిన పోలీసులు

సౌండ్‌ పోల్యూషన్‌తో వాహనాలు నడిపితే  కఠిన చర్యలు  
జగిత్యాల టౌన్ సిఐ రాంచందర్‌రావు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలో సౌండ్ పోల్యుషన్ సైలెన్సర్ వాహనాలఫై జగిత్యాల పోలీసులు కొరడా జులిపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుండి నుండి శబ్ద కాలుష్యం చేసుకుంటూ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి కలిగిస్తూ తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పి భాస్కర్ ఆదేశాల మేరకు  జగిత్యాల పట్టణ సిఐ రామచంద్ర రావు నేతృత్వంలో ట్రాఫిక్ ఎస్ఐ ఎల్. రామ్  శబ్ద కాలుష్య బైక్ లఫై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధిక సౌండ్‌ వచ్చే సైలెన్సర్లను అమర్చుకుని తిరుగుతున్న 35 సౌండ్ పోల్యుషన్ బైక్ లను పట్టుకున్నారు.

 ఈ సందర్బంగా బైకులను పోలిస్ స్టేషన్ కు తరలించి భారి శబ్దం వచ్చె సైలెన్సర్లను తొలగించి వాటి స్థానంలో తక్కువ సౌండ్‌ వచ్చే సంబంధిత కంపని సైలెనసర్లను వాహన యజమానులతో తెప్పించి బిగించి, వాహన దారులకు జరిమానా విధించారు.  ఈ సందర్బగా పట్టణ సిఐ రామచందర్ రావు మాట్లాడుతూ ఎవరైన సౌండ్‌ పోల్యూషన్‌తో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మేకానికులు కూడా నిబందనలకు విరుద్ధంగా బైక్ లకు సౌండ్ పోల్యుషన్  సైలెనసర్లను అమర్చావద్దని హెచ్చరించారు. మరోసారి పట్టణంలో శబ్ద కాలుష్య సైలెన్సర్లుతో పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్సు చేస్తామని తెలిపారు.