పండగల పల్లె ప్రగతి ఉత్సవాలు

పండగల పల్లె ప్రగతి ఉత్సవాలు
  • అభివృద్ధి కార్యలయాల ముస్తాబు
  • కల కళలాడిన గ్రామాలు

ముద్ర న్యూస్ రేగొండ:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే రేగొండ మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనాలు,స్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు,డంపింగ్ యార్డులు,గ్రామల్లోని సీసీ రోడ్లు,శుభ్రత గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను మామిడి తోరణాలతో సుందరికరించారు.

అలాగే గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు.ఆయా శాఖల అధికారులతో గ్రామాల్లో ఊరేగింపు చేశారు.మండలంలోని రూపిరెడ్డీ పల్లి,గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ అద్వర్యంలో గ్రామ పంచాయతీ భవనంలో గ్రామ సిబ్బందితో సందడి చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామ సిబ్బందిని సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని,సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పతకాలు ప్రజల్లో స్థిర స్తాయిగా నిలిచిపోతాయని అన్నారు....