పోలీసుల ఉచిత వైద్య శిబిర పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ 

పోలీసుల ఉచిత వైద్య శిబిర పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పీ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్  ఆధ్వర్యంలో జిల్లా పోలీసుల కోసం శనివారం నుంచి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం పోస్టర్ ను జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్  ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ఉచిత గుండె, ఆర్తో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బంది ,హోం గార్డ్స్, వారి కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఐఎంఎ , సన్ షైన్ హాస్పిటల్ కరీంనగర్ సహకారంతో  సన్ షైన్ హాస్పిటల్ లో ఉచిత గుండె, ఆర్తో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని అధికారులు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి సూచించారు.

పోలీస్  అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బంది , హోం గార్డ్స్ కు  ఉచిత గుండె మరియు ఆర్తో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి  ఒప్పుకున్న సన్ షైన్ హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యనికి,ఇండయన్ మెడికల్ కౌన్సిల్ కు  ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్ గారు జిల్లా ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్, సన్ షైన్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ రెడ్డి, పియంపి జిల్లా అధ్యక్షుడు  డా.రాజగోపాల్ చారి పాల్గొన్నారు.