మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సియం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సియం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళా సాధికరతకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ధర్మపురి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు కూరగాయలతో తయారు చేసిన బోకే లు అందజేసి, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల సంక్షేమానికి ముఖ్య మంత్రి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని తెలిపారు. ఇంటికి వెలుగు ఇల్లాలు అని, ఇల్లాలితో గృహం కల కల లాడుతుందని మంత్రి అన్నారు. ఇల్లాలిని గౌరవంగా చూడాలని, తద్వారా ఆ కుటుంబం బాగుంటుందని, మహిళలకు ఆలోచనా గుణం ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

సిజెరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించడం జరిగిందని అన్నారు. ప్రతీ పని మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ చేసిన గొప్ప పనులు గుర్తు చేసుకోవాలసిన అవసరం ఉంటుదని, మాటల్లో కాకుండా చేతల్లో తెలంగాణ ప్రభుత్వం పనులు చేసి చూపెడుతున్న దనడానికి ఉదాహరణ అని అన్నారు. మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతతో , ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ, ఆయా, వసతి గృహాల సంక్షేమ శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా ప్రజా ప్రతినిధులను మంత్రి, కలెక్టర్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జెడ్పీటీసీ బత్తిని అరుణ , ఎంపిపి చిట్టి బాపు, డిసిఎంఎస్ చైర్మన్ ఏళ్ళల శ్రీకాంత్ రెడ్డి, AMC చైర్మన్ అయ్యోరు రాజు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.