అంతరాష్ట్ర సైబర్ నిందితుడు అరెస్ట్...

అంతరాష్ట్ర సైబర్ నిందితుడు అరెస్ట్...
  • రూ 2,00,000/-,మూడు మొబైల్ ఫోన్స్,6 సిమ్ కార్డ్స్, బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం...
  • ఎస్పీ అఖిల్ మహాజన్..

 ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని, నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర సైబర్ నిందితుని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు.  సైబర్ నిందితుని నుండి 2,00,000/-రూపాయలు, మూడు మొబైల్ ఫోన్స్, 6 సిమ్ కార్డ్స్, బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుని వివరాలును ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. బీహార్ రాష్ట్రనికి చెందిన కుందన్ కుమార్ గత ఆరు నెలల నుండి ఆన్ లైన్ పేజిలో వివిధ రకాల సిమెంట్ కంపెనీల తప్పుడు వివరాలను మరియు తప్పుడు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ లను ఏర్పాటు చేసి, ఎవరైనా సిమెంట్ అవసరం ఉన్నవారు అట్టి వివరాలు చూసి ఫోన్ చేస్తే అట్టి అమాయక వ్యక్తుల నుండి తక్కువ రేటుకే సిమెంట్ ఇస్తానని వారి వద్ద నుండి డబ్బులు కాజేసేవాడు. 

ఈ క్రమంలో  రాజన్న సిరిసిల్ల  జిల్లా కీ చెందిన ఉత్తం అంజయ్య  బిర్లా ఎ -1 సిమెంట్ కు ఆన్లైన్లో వెతకగా,  బిర్లా ఏ వన్ సిమెంట్ కస్టమర్ కేర్ నెంబర్ అనుకొని 18004192877 కి కాల్ చేసి , బిర్లా A -1 కంపనీ కి చెందిన నాన్ ట్రేడ్ సిమెంట్ 640 బస్తాలు కావాలని అడుగా, అందుకు రూపాయలు 1,69,600,/-లను డిపాజిట్ చేయమని చెప్పగా, డిపాజిట్ చేశాడు. సిమెంట్ బస్తాలు రాకపోవడంతో అంజయ్య, కుందన్ కీ ఫోన్ చేయగా  మిగతా 340 సిమెంట్ బస్తాలకు డబ్బులు డిపాజిట్ చేయమనడంతో, 95,400/-లను డిపాజిట్ చేసాడు. అంజయ్య సిమెంట్ బస్తాలు ఎప్పుడు పంపిస్తావని కుందాన్ ని అడుగగా మరో 11000/- రూపాయలను పంపిస్తే, సిమెంట్ బస్తాలు పంపుతానని చెప్పడంతో, దీంతో  మోసపోయినని గ్రహించిన అంజయ్య 13 మే 2023 వీర్నపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. దీంతో  సిఐ మోగిలి ఆధ్వర్యంలో సైబర్ సెల్ ఎస్ఐ జునైద్, ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ నయుమ్ లు కేసును చేదించి నిందితుని అరెస్టు చేశారు.  

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోన్ అప్, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేరుతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే  (www.cybercrime.gov.in) లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు.