కరీంనగర్ లో మర్డర్

 కరీంనగర్ లో మర్డర్
  • గొంతు కోసి హత్య
  • ఆస్ట్రేలియా నుండి ఇటీవలే వచ్చిన హతుడు
  • రంగంలోకి  పోలీస్ బృందాలు

ముద్ర ప్రతినిధి కరీంనగర్:  కరీంనగర్  విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో పీటీసీ రోడ్డు లో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సంతోష్ నగర్ లో మూతపడ్డ ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ దారుణం చోటుచేసుకుంది. నరేందర్ తో పాటు మరికొందరు కలసి మద్యం సేవించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మద్యం సేవించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 కుటుంబ కలహాలు ఈ సంఘటనకు కారణం అయి ఉండవచ్చన్నది మరో కోణం. నరేందర్ సంతోష్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. కొద్దీ రోజులు ఆస్ట్రేలియాలో ఉండి ఇటీవలే కరీంనగర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని సందర్శించి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, టూ టౌన్ సీఐ లక్ష్మిబాబు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీముతో మర్డర్ కు గల ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉగాది పండుగ వేళ హత్య జరగడంతో కరీంనగర్ ఉలిక్కిపడింది.