దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కల్నల్ సంతోష్ బాబు

దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కల్నల్ సంతోష్ బాబు

కోదాడ టౌన్ ముద్ర: దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు  కల్నల్ సంతోష్ బాబు అని పలువురు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు  అన్నారు. గురువారం సంతోష్ బాబు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి సంతోషిని వారి కుటుంబ సభ్యులతో కలిసి కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్, ప్రోగ్రాం చైర్మన్ జగనీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు   కల్నల్ సంతోషబాబు అని  సేవలను కొనియాడారు. 

నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను సాధించాలన్నారు. ఈ సందర్భంగా కోదాడలో భావితరాలకు తెలిసే విధంగా సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అహర్నిశలు కృషిచేసిన ప్రోగ్రాం చైర్మన్ జగనీ ప్రసాద్ ను,  వాసవి యూత్ క్లబ్ సభ్యులను సంతోష్ బాబు సతీమణి సంతోషిని వారిని అభినందించారు.  ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు బెలేదే భరత్ కుమార్, సెక్రటరీ ఉప్పల నవీన్,కోశాధికారి యదా కిరణ్,  జాయింట్ ట్రెజరర్ యదా రాణి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ గరనే శ్రీధర్, జగిని ప్రసాద్,  బండారు శ్రీనివాసరావు,క్లబ్ ఆఫీసర్ దేవరశెట్టి శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ,సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి తెల్లాకుల వెంకటేశ్వర్లు,అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి రాష్ట అధ్యక్షుడు అరవపల్లి సత్యనారాయణ, కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ బాబు,సెక్రటరీ సేకు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.