మెదక్ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం

మెదక్ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట,  22వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క మూలమూర్తులందరికి కూడా ఉదయం పుట్ట తేనెతో అభిషేకం మహాభిషేకం జరిగింది. అలంకారము, హారతినిచ్చారు. గణపతి, గౌరీ పూజలు, కంకణ ధారణ, పుణ్యాహవాచనం, నవగ్రహమంటపము, యోగిని వాస్తు, ఆవాహిత దేవత పూజలు, గణపతి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ, శివ, నవగ్రహ, శ్రీధర్మశాస్త్ర అష్టోత్తర శతనామ పూజలతో పాటు ఆవాహిత దేవత హవనములు, మూలమంత్ర హవనములు జయాధులు పూర్ణాహుతి నిర్వహించారు.

ఈశ్వరపురం వేద పండితులు బ్రహ్మశ్రీ కాసుల ఆదిత్య వర్ధన్ శర్మ, వైద్య రాజు పంతులు, వైద్య శ్రీను పంతులు, అంకుష్ శర్మలు నిర్వహించారు.  భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్త సేవా సమాజం బాధ్యులు గంగా లక్ష్మీపతి, కొండా శ్రీనివాస్, తొడుపునూరు శివరామకృష్ణ, మేడిశెట్టి శంకర్,   పురం వెంకటనారాయణ, ఉప్పల శ్రీనివాస్, బచ్చు పార్తివనాథ్, యాచం చిన్నరాజు, శ్రవణ్,  చకిలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.