రజకుల సౌలభ్యానికి యాంత్రీకృత ధోభీ ఘాట్

రజకుల సౌలభ్యానికి యాంత్రీకృత ధోభీ ఘాట్

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం లో కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహాం కల్పించి పూర్వ వైభవం తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో భాగంగా బుదవారం రోజు 34,35 వ డివిజన్ పరిది సప్తగిరి కాలనీలో నగరపాలక సంస్థ 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మాణం చేసిన అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్ ను స్థానిక కార్పోరేటర్లు చాడగొండ బుచ్చి రెడ్డి, షకీరా అంజూమ్ బర్కత్ అలీ, కమీషనర్ ప్రపూల్ దేశాయ్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ధోభీ ఘాట్ లో ఏర్పాటు చేసిన 3 వాషింగ్ మిషన్లు, 3 హైడ్రో ఎలక్ట్రాక్టర్లు, 2 ట్రంబుల్ డ్రైయర్స్, సారీ రోలర్, బెడ్ షీట్ రోలర్, 2మ్యాన్వల్ ఐరన్ టేబుల్స్, 2 వాక్యూమ్ ఐరన్ టేబుల్స్  యంత్రాల పని తీరును మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ ధోభీ ఘాట్ లో ఒక గంటకు 240 దుస్తులు, ఓక్క రోజుకు 2500 దుస్తువులు వాషింగ్ చేసేలా సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల కుల వృత్తిలో సులభతరం కావాలనే ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 142 అర్బన్ లోకల్ బాడీస్ లో 142 దోభీ ఘాట్ ల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. 

రాష్ట్రంలో నే కరీంనగర్ నగరపాలక సంస్థ యాంత్రీకృత ధోభీ ఘాట్ రాష్ట్రంలో 3 వ ధోభీ ఘాట్ నిర్మాణం చేయడం జరిగింది అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా మరో ధోభీ ఘాట్ నిర్మాణం చేసి నగరంలో రెండు ధోభీ ఘాట్ లు రజకులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయి బ్రాహ్మాణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ దన్నారు. అంతే కాకుండా నిత్యం రెక్కల కష్టం చేసుకుని బట్టలు ఉతికే రజకులకు సౌలభ్యంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్ లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. నగరపాలక సంస్థ ద్వారా 2 కోట్ల రూపాయల కేటాయించి అన్ని రకాల సౌకర్యాలతో మాడ్రన్ ధోభీ ఘాట్ నిర్మాణం చేశామన్నారు. మరో ధోభీ ఘాట్ నిర్మాణం చేసేందుకు కూడ ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. రజక బిడ్డలు అధునాతన యాంత్రీకృత ధోభీ ఘాట్ వినియోగించుకొని కల వృత్తిని చేస్కోవాలని పిలుపు నిచ్చారు. గతంలో ఎల్ఎండి డ్యాం లో రజక బిడ్డలు అష్ట కష్టాలు పడుతూ బట్టలుతుకుతుంటే బాధగా అనిపించేదన్నారు. డ్యామ్ నీళ్ళలో బట్టలుతుకుతుంటే కరీంనగర్ వాసుల సూటిపోటి మాటలతో రజకులు ఇబ్బందులు పడేవారన్నారు. కాని ఇప్పుడు రజకుల కోసం యాంత్రికృత ధోబిఘాట్లతో తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ బట్టలు ఉతికే అవకాశం లభించిందన్నారు. 

 సమైక్య పాలనలో బట్టలు ఉతికేందుకు నీళ్లు సరిగ్గా లేక రజకులు అనారోగ్యానికి గురైన రోజులుండేవని ఆవేదనవ్యక్తం చేశారు. ఆధునిక దోబీ ఘాట్లలో గంటకు 240 బట్టలు రోజుకు 2500 బట్టలు ఉతికే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని రజకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో బట్టలను బండకేసి బాధడంతో బట్టలు చెడిపోయే ప్రమాదం ఉండేదని కానీ ఆధునిక దోబీ ఘాట్లతో అలాంటి పరిస్థితి ఉండ దన్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా దోబీ ఘాట్లలొ ఎప్పుడైనా బట్టలు ఉతుక్కోవచ్చని అక్కడే డ్రై చేసుకుని ఇస్త్రీ కూడా చేసుకోవచ్చన్నారు. నగరవాసులకు సౌలభ్యంగా ఉండేలా నగరం నలువైపుల ఆధునిక దోభీ ఘాట్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని ఉధ్ఘాటించారు. మరో వైపు మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ లో రాష్ట్రం లోనే 3 వ ధోభీ ఘాట్ గోదాంగడ్డ ధోభీ ఘాట్ అన్నారు. అత్యాధునిక మైన వసతులతో ధోభీ ఘాట్ నిర్మాణం చేశారు. రజక సోదరులు ధోభీ ఘాట్ నిర్మాణం తో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 142 అర్బన్ లోకల్ బాడీలో ప్రతి లోకల్ బాడీలో ఒక అధునాతన యాంత్రికృత దోభీ ఘాట్ నిర్మాణం కు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి 240 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.

 మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ లో రెండు ధోభీ ఘాట్ నిర్మాణం కు ప్రపోజల్ చేయడం జరిగిందని మొగటగా గోదాంగడ్డ ధోభీ ఘాట్ నిర్మాణం ప్రస్తుతం అందుబాటులో కి తెచ్చామన్నారు. దీనివల్ల రజక సోదరుల కుల వృత్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభ తరంగా ఉంటుందన్నారు. యాంత్రికృత దోభీ ఘాట్ లో గంటకు 240 బట్టలు వాషింగ్ చేసి ఐరన్ చేయవచ్చన్నారు. హాస్పిటల్ దుస్తులు ఉతికే వారికి సఫరేట్ గా వెనుకాలొ కూడ వేరే నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వివిధ కులాలాకు అనేక రకాల సౌకర్యాలు కల్పించాలన్నది కేసిఆర్ లక్ష్యం అన్నారు. అన్ని కులాల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్ని కులాలకు కావల్సిన బ్రతుకు దెరువు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రతి కులానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల భవనాలు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ లో కూడ మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో అన్ని కుల సంఘాల భవనాలు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ ప్రపుల్ దేశాయ్, పలువురు కార్పోరేటర్లు అధికారులు పాల్గొన్నారు.