బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం ప్రచారం

బిజెపి అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం ప్రచారం

ముద్ర, వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు ను ఎన్నికల్లో గెలిపించాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మండలం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఐదేళ్లుగా కొల్లాపూర్ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న బిజెపి పార్టీ కావాలా పూటకో పార్టీలు మారుతున్న నాయకులు కావాలా ఒక్కసారి ఆలోచించాలని,సుధాకర్ రావు   సమస్యల పరిష్కారం కోసం, పిల్లల భవిష్యత్తుకోసం తన ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి మనలో ఒకడిగా నిత్యం ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాడని, ఎమ్మెల్యే గా గెలిపిస్తే కొల్లాపూర్ ను విద్య, వైద్య, రవాణా, ఉపాధి రంగాలతో పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే నెం. 1.నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ప్రచారం చేస్తున్నారు.కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల నారాయణ, ఒబీసీ జిల్లా కార్యదర్శి శరత్ గౌడ్,నాయకులు కరుణాకర్,నాగేoద్రం ఉన్నారు.