ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా

ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా

ముద్ర, వనపర్తి: బి ఆర్ ఎస్ పార్టీ నిర్ణయం మేరకు పార్టీలోని మరోకొరికి అవకాశం కల్పించడానికి ఛైర్మెన్, వైస్ చైర్మన్ పదవుల నుండి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పార్టీలో చర్చించిన తర్వాత ఛైర్మెన్, వైస్ చైర్మన్ గా స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు వివరించారు.ఈ సందర్బంగా ఛైర్మెన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి  సహకారముతో పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశామని అన్నారు సహకరించిన పార్టీకి, కౌన్సిలర్లకు,అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు కురుమూర్తి యాదవ్, నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,సయ్యద్. జామీల్ కౌన్సిలర్స్ లక్ష్మినారాయణ, మహేష్,పాకనాటి.కృష్ణ,నాగన్న యాదవ్,బాషా నాయక్, నాయకులు ఉంగ్లము. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,షరవంద,స్టార్.రహీమ్, ఎల్ఐసి కృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు