ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లాలో మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలోని పోలింగ్ కేంద్రం 29 29 / ఏ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరులని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు ఎలక్షన్ ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేందర్ గౌడ్,  సిబ్బంది పాల్గొన్నారు.