లెనిన్ జీవిత చరిత్ర పుస్తకాల ఆవిష్కరణ

లెనిన్ జీవిత చరిత్ర పుస్తకాల ఆవిష్కరణ

ముద్ర.వీపనగండ్ల:- ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ విప్లవం జయప్రదం కావాలంటే లెనిన్ జీవిత చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి అన్నారు.రెడ్ బుక్ డే సందర్భంగా లెనిన్ జీవిత చరిత్ర పుస్తకాలను పార్టీ మండల కార్యాలయంలో ఆవిష్కరించి అనంతరం,పుస్తకం పై చర్చించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎర్ర పుస్తకాల కోసం వెతుకులాట ప్రారంభమైందని, కారణం నేటి ప్రపంచానికి ప్రత్నియం కావాలన్నారు. పెట్టుబడిదారు వ్యవస్థ ఏ సమస్యలను పరిష్కరించలేని నిర్జీవ స్థితికి జారుతూ ఉంటే, ప్రత్యామ్నాయం  కోసం వెతుకులాట అనివార్యంగా మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథాలను చదవడం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంద అన్నారు.

కమ్యూనిస్టుల  నాయకత్వంలో గతంలో రష్యా, తూర్పు యూరప్ దేశాలలో, నేడు చైనా, వియత్నం,క్యూబా, ఉత్తరకొరియా, లావోస్  ఉంటే సోషలిస్టు దేశాలలో సంక్షోభ రహిత ఆర్థిక అభివృద్ధి కనబడుతుందని, అందువల్లనే పెట్టుబడుదారి పాలకులు, వారి పార్టీలు ఎన్నికల చుట్టూ, సంక్షేమ పథకాలు చుట్టూ పరిభరణించేటట్లు ప్రజల్ని తిప్పుతున్నారని విమర్శించారు.ఇప్పుడు బంతి కమ్యూనిస్టులు, వామపక్షాలు,ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు పార్టీలో కోర్టులో పడిందని.ఈ సంక్షోభాలను పరిస్థితులను ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వరకు విప్లవాదం జయప్రదం కావాలంటే ఆనాడు రష్యాలో విప్లవం జయప్రదం చేసిన, లెనిన్ విప్లవోద్యమ  చరిత్రను అధ్యయనం చేయాలని వారన్నారు.ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు సిహెచ్ వెంకటయ్య, ఆశన్న, ఈశ్వర్, నాయకులు వెంకటేశ్వర్ గౌడ్, బత్తుల రాముడు, నాగేష్,ప్రవీణ్ గౌడ్, రామన్ గౌడు,తిరుపతయ్య, రామకృష్ణ, శ్రీనివాసులు, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.