కరీంనగర్ లో నేడు రేపు 144 సెక్షన్

కరీంనగర్ లో నేడు రేపు 144 సెక్షన్

కరీంనగర్ సిపి ఎల్ సుబ్బరాయుడు

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష నేపథ్యంలో కరీంనగర్ కమిషన రేట్ పరిధిలో ఈనెల శనివారం, ఆదివారం  144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఉత్తర్వులు వెలువరించారు.

ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష జరగనున్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జనం జమకూడి ఉండరాదని చెప్పారు. ఈ ఉత్తర్వులు అమలులో ఉన్న నేపథ్యంలో ధర్నాలు, రాస్తారోకాలు, సమావేశాలు, ఆందోళనలు ఏలాంటివి నిర్వహించకూడదని చెప్పారు.