నారాయణరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

నారాయణరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే సతీష్ బాబు

సైదాపూర్ ముద్ర: మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్రాల నారాయణరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ అంత్యక్రియల హాజరై నివాళులర్పించారు. పూలమాల వేసి నివాళులు అర్పించి వారి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను  ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.