మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం

మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి పథకం
  • 28 మంది గిరిజన కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
  • నాప్స్కాబ్  చైర్మన్ కొండూరు రవీందర్ రావు 
     

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మంది గిరిజన కుటుంబాలకు గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులను   ఎంపీపీ నాప్స్కాబ్  చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో  కలిసి   గురువారం వీర్నపల్లి రైతు వేదికలో లబ్ధిదారులకు అందించారు. రవీందర్ రావు మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లికి  మేనమామ లాగా  తన వంతు సాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఒక లక్ష 16 వేలు కట్న కానుకలకు  ఎంతో ఉపయోగపడుతుందని  అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి , మండల సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం,సర్పంచ్, ఎంపీటీసీలు  బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.