14 వేల వడలతో హనుమంతునికి అలంకరణ

14 వేల వడలతో హనుమంతునికి అలంకరణ

 సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: నమ్మిన భక్తుల పాలిట కొంగుబంగారమై  విలసిల్లుతున్న శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయములో మంగళవారం రోజున 14000 వడలతో ఆంజనేయ స్వామిని అలంకరించారు. హనుమద్ దీక్షలో ఉన్న భక్తులు, అన్నదాన ట్రస్టు, ఆలయ ప్రధాన అర్చకులు వైద్య కృష్ణమాచార్యులు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి కోసం, ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన 14 వేల వడలను తయారు చేయించి మాలగా వేశారు.

ఈ వడలు బుధవారం వరకు భక్తుల దర్శనార్థం  ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరణగా ఉంటాయని వైద్య కృష్ణమాచార్యులు తెలిపారు బుధవారము హనుమాన్ దీక్ష భక్తులకు ట్రస్టులో జరిగే అన్న ప్రసాదంలో  అందిస్తామని తెలిపారు. స్వామి వారి పూజకు హాజరయ్యే భక్తులకు కూడా వడలను ఇస్తామన్నారు. ఈ వడలు స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనవని  వాటిని ప్రసాదంగా  తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కృష్ణమాచార్యులు తెలిపారు.