రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు
  • జిల్లాలోని మీసేవ బృందాలతో అదనపు కలెక్టర్ సమీక్ష
  • "ఐటి-పారిశ్రామిక ఉత్సవం"

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5 వ రోజైన మంగళవారం "ఐటి-పారిశ్రామిక ఉత్సవం" పురస్కరించుకుని సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో  ఇన్పర్మేషన్ టెక్నాలజీ &కమ్యూనికేషన్,మీ-సేవా సిబ్బందితో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూజిల్లా నలుమూలల నుండి వచ్చిన ఐటీ అండ్ సి, మీసెవ ప్రతినిదులందరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. మీసేవ, సిఎస్ సి- విఎల్ఈఎస్ లు చెస్తున్న సేవలను కొనియాడారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామనీ  హామి ఇచ్చారు.గత సంవత్సరం చేసిన సేవలకు గాను ఈ సేవా నుండీ జి.రాజు, టిఎస్ నుండి శ్రీనివాస్, టిఎస్ ఆన్లైన్ నుండి పి. ఉపేందర్,ఓఎస్ఎస్ నుండి కె. సంతోషి, సీఎస్సి నుండి ఎం.రవి లను అభినందించారు. జిల్లాలో మీ సేవ లో జరిపే లావాదేవీలు 2016 నుండి 2023 మే వరకు 85 లక్షలకు పైగా జరిగాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.అందరికీ అందుబాటులో ఉంటు సేవలను అత్యంత నిబద్ధతతో ప్రజలకు అందిస్తూ అందరి మన్ననలను ఎప్పటికీ ఇలాగే పొందాలని మీ సేవకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్,ఈడిఎం ఆనంద్, మీ సేవ జిల్లా మెనెజర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.